దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. గురువారం ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. మ్యాచ్‌లో డికాక్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ రికార్డు బ్రేక్ అయింది. భారత జట్టుపై…