పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య…
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి.
ఇప్పుడు ఇమానే మహిళల బాక్సింగ్‌లో 66 వెయిట్ కేటగిరీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆమె దేశానికి పతకాన్ని (కాంస్యం) అందించింది. ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో హంగేరీకి చెందిన అనా లుకా హమోరీని 5–0తో ఓడించింది. దీంతో.. అల్జీరియా ఏడో పతకాన్ని గెలుచుకున్న బాక్సర్‌గా నిలిచింది. మహిళల బాక్సింగ్‌లో అల్జీరియాకు ఇదే తొలి ఒలింపిక్ పతకం. ఖలీఫ్, లిన్ కూడా 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో పోటీలో పాల్గొన్నారు కానీ పతకం సాధించలేదు. అయితే.. తాజాగా విజయం, పతకం ఖాయం చేసుకున్న…
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగుతేజం, భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు… మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాన్ని సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది… ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించారు సింధూ.. 21-15, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేసిన ఆమె.. వరుస విజయాలతో గ్రూప్-జేలో అగ్రస్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది… మరో విజయం సాధిస్తే కాంస్యం పతకం సాధించడం…