ఇరాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్‌లోని కెర్మాన్‌లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది.
Iran Blasts: ఇరాన్ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్…