సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అందమైన నటి రష్మిక మందన్న త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. “భీష్మ” హీరోయిన్ ను ఇప్పటికే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు అభిమానులు. ఆమె తొలి చిత్రం “మిషన్ మజ్ను” విడుదలకు ముందే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో “గుడ్‌బై” అనే మరో హిందీ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ యాక్టివ్ గా ఉండే…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా వున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సెట్ లోని ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకు సుకుమార్ ‘రంగస్థలం’లో అనసూయ…
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం…
కరోనా సెకండ్ వేవ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఇంకా విడుదల కాలేదు. చాలా రోజుల తరువాత ఇప్పుడిప్పుడే వెండితెరపై బొమ్మ పడుతోంది. దీంతో విడుదల వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బిగ్…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇది. “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా…
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘డాక్కో డాక్కో మేకా’ అనే పాటను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్)లో పాడారు. యాదృచ్ఛికంగా “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ ను…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌పై పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తను చదువుకున్న స్కూల్ కోసం భారీగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మట్టపర్రు ప్రభుత్వ పాఠశాలను నిర్మించడానికి తనవంతు సాయం చేశారు. స్కూల్ భవనం కోసం సుకుమార్ రూ.18 లక్షలు ఖర్చుచేసి నిర్మించారు. అంతేకాకుండా భవనానికి తన తండ్రి పేరును పెట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో కలిసి సుకుమార్ దంపతులు ఈ భవనాన్ని ప్రారంభించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇకపై తాను మట్టపర్రు…
సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ కు రీసెంట్ గా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సుకుమార్‌కు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో “పుష్ప” షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు సుకుమార్ రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “పుష్ప షూటింగ్ కేవలం మూడు రోజులు ఆగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు పూర్తిగా కోలుకున్నాడు. సుకుమార్ సోమవారం…
అగ్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప” చిత్రీకరణను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుకుమార్ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నాడు. ఆయన గత కొన్నేళ్లుగా హోమియోపతిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా వైరల్…