సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ కు రీసెంట్ గా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సుకుమార్‌కు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో “పుష్ప” షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు సుకుమార్ రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “పుష్ప షూటింగ్ కేవలం మూడు రోజులు ఆగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు పూర్తిగా కోలుకున్నాడు. సుకుమార్ సోమవారం నుండి సెట్ లో చేరి షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తాడు” అని చెప్పారు. అంటే ఈ రోజే “పుష్ప” షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
Read Also : ఆర్ఆర్ఆర్ : కీరవాణితో అనిరుధ్ మ్యూజిక్ సెషన్ కంప్లీట్
రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన “పుష్ప” గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మే నెలలో మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది ఆగస్టు 13న, రెండవ భాగం 2022లో విడుదల కానున్నాయి. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తెలుగులో భారీ రేంజ్ లో విడుదల కానుంది. ప్రధాన విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా… ఈ యాక్షన్ డ్రామాను ముత్తాశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.