రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘డాక్కో డాక్కో మేకా’ అనే పాటను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్)లో పాడారు. యాదృచ్ఛికంగా “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ ను కూడా 5 భాషల్లో ఐదుగురు సింగర్స్ పాడారు. ఫస్ట్ సింగిల్ “దాక్కో దాక్కో మేక” అనే పేరుతో విడుదల కానుంది. అల్లు అర్జున్ మీద చిత్రీకరించబడింది ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉండేలా కన్పిస్తోంది. అంతేకాకుండా ఈ సాంగ్ లో మాస్ బీట్స్ తో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీని కూడా చూడవచ్చని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన “దాక్కో దాక్కో మేక” సాంగ్ ఆగస్టు 13న విడుదల కానుంది.
Read Also : “రాక్షసుడు-2” కోసం షాకింగ్ బడ్జెట్
దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తోంది. మరి అంచనాలు మామూలుగా ఉంటాయా ? ఇక “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా… రష్మిక మందన్న హీరోయిన్ గా గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌లపై “పుష్ప”ను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ స్కోర్ చేస్తున్నారు.
5 Languages, 5 singers & One Rocking Tune by @ThisIsDSP 🎵
— Pushpa (@PushpaMovie) August 2, 2021
Icon Staar @alluarjun's #PushpaFirstSingle on AUG 13th🔥#HBDRockStarDSP#DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke #JaagoJaagoBakre#Shivam @benny_dayal @RahulNOfficial @rvijayprakash @VishalDadlani pic.twitter.com/aqzKCrcg62