ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ విడుదల తరువాత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్…
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. అతని జ్వరం తగ్గుతోందని మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఫీడ్లను బాగా తట్టుకుంటున్నాడని కూడా పేర్కొన్నారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క శ్రీతేజ్…
దాదాపు రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న ‘పుష్ప 2’ ఇంకా స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ (హిందీ) సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్…
Sandhya Theatre: పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్,…
Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…