Rashmika : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అమ్మడు వరుస హిట్లు కొడుతూ నేషనల్ క్రష్ గా కొనసాగుతూ ఉంది. తాజాగా తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె “పుష్ప 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించుకుంది. పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ లోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది పుష్ప 2. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకించి జాతర ఎపిసోడ్ లో రష్మిక డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. రష్మికకు ఎంతోమంది కొత్త అభిమానులను సంపాదించిపెట్టింది పుష్ప 2 సినిమా.
Read Also:Congress: జార్జ్ సోరోస్‌ను విందుకు ఆహ్వానించారన్న కేంద్ర మంత్రి.. శశి థరూర్ సీరియస్..!
“పుష్ప 2” తో పాటు రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రష్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సికిందర్ సినిమా కూడా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో నటించడం కూడా రష్మికకు 2024 మిగిల్చిన ఒక మంచి మెమొరీ. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ కు సెండాఫ్ ఇస్తూ మరో సెన్సేషనల్ స్టార్ట్ కోసం 2025 కు వెల్ కమ్ చెప్పేందుకు ఆమె ఈగర్లీ వెయిట్ చేస్తోంది.
Read Also:KTR Challenge: కేటీఆర్ సవాల్.. రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా..