Seethakka: పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 సినిమాపై, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై, అల్లు అర్జున్ పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఒక అభిమాని సినిమా థియేటర్ కి వెళ్తే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.చట్టానికి లోబడి హీరోపై కేసు పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఆ సినిమా నటుడు పరామర్శించకపోవడం చాలా బాధాకరం అని సీతక్క అన్నారు. ఆ కుటుంబానికి సహాయం చేయకుండా,ఆ నటుడుని మిగతా నటులు పరామర్శిస్తున్నారు. చివరికి అభిమానే సినిమాకి వెళ్లడం తప్పు అన్నట్లు చేస్తున్నారు. నటుడు అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి గానీ, సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి కోపం లేదన్న ఆమె ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. చట్టానికి ఉన్న పరిమితులు లోబడే చట్టం తన పని చేసుకోపోతుందన్న ఆమె ప్రజలను హక్కులను కాపాడుకోవడానికి,చట్టాన్ని రక్షించుకోవాలి,చట్టబద్ధంగా ఎవరైనా శిక్షార్హులే అని అన్నారు. అతిగా ఎవరు ప్రవర్తించిన వారికి శిక్ష ఉంటుంది, ప్రజలకు భరోసా ఉంటుంది. చట్ట నియమ,నిబంధనలు అనుసరిస్తేనే శాంతి ఉంటుంది,క్రమ శిక్షణ ఉంటుందని ఆమె అన్నారు.
Honda-Nissan: హోండా, నిస్సాన్ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్?
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
బిజెపి నాయకులను ఒకటి అడుగుతున్నా.. భారత రాజ్యాంగం వచ్చిన, దానిలోని హక్కులు చాలా మందికి తెలియవు, జై భీమ్ సినిమా అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది.. అటువంటి సినిమాకి ఒక్క అవార్డు ఇవ్వలేదు,గుర్తించలేదని ఆమె అన్నారు. ఒక స్మగ్లింగ్ చేసే సినిమాకు గొప్పగా అవార్డు ఇస్తున్నారు. స్మగ్లింగ్ చేసే సినిమాలో రాజ్యాంగబద్ధంగా పనిచేసే అధికారులను బట్టలిప్పి చూపించారు, అటువంటి సినిమాలు గొప్పగా పొగుడుతారు అవార్డులు ఇస్తారని అన్నారు. సినిమాలకు సినీ కుటుంబాలకు మేము కూడా మద్దతుగా ఉంటాం.. కానీ సొంత సిబ్బందితో జనాలను ఇబ్బందులు గురి చేస్తే ఊరుకునేది లేదని ఆమె తేల్చి చెప్పారు. పేదవారు తప్పు చేస్తే కేసులు పెడుతున్నాం.. పెద్దింటి వారు తప్పు చేస్తే కేసులు పెట్టొద్దు అనడం ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నించారు. సమాజంపై సినిమాల పాత్ర అంతగానే ఉంటుంది.. సన్మార్గమైన సినిమాలను ఆహ్వానిస్తామని అన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం అందరూ సమానులే.. దానినే మేము అనుసరిస్తున్నామని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!