అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా…
Allu Arjun : అది గంగోత్రి సినిమా సమయం.. అందులో ఓ కుర్రాడు హీరో అని ఇండస్ట్రీలో పేరు వినిపిస్తోంది. అతన్ని చూసిన చాలా మంది ఒకటే కామెంట్.. వీడు హీరో ఏంట్రా.. ఇలా ఉన్నాడేంటి.. ఈ మాటలు ఆ కుర్రాడిని కుంగదీయలేదు. రాటు దేలేలా చేశాయి. వీడు హీరో ఏంట్రా అన్న వారే.. హీరో అంటే ఇలాగే ఉండాలి అనేలా జై కొట్టించుకున్నాడు.. అతనే ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియాను ఏలుతున్నాడు.…
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం…
Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్‌మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ…
Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవులత్లో దుంగలు దాచే సీన్లు.. బాగా ఆకట్టుకున్నాయి కదా. వాటిని చూసి అసలు సుకుమార్ ఇవన్నీ ఎక్కడ నుంచి క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప-2లోని అన్ని సీన్లు వీఎఫ్ ఎక్స్…
గత ఏడాది డిసెంబర్ 6న విడుదలైన పుష్ప 2: ది రూల్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, చాలా వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ముఖ్యంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (డిఎస్పి) వ్యవహరించారు. ఆయన అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఆర్సిబి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అజింక్య రహానే కెకెఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా సగటు స్కోరు -…
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ప్రారంభ వేడుక జరుగుతోంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శన ఇస్తారో ఆయన వివరించారు. నటి దిశా పటానీ వేదికపైకి అడుగుపెట్టగానే అందరినీ ఆకట్టుకుంది. తన నృత్య ప్రదర్శనతో వేదికను…
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ల్లో దేవి శ్రీ ప్రసాద్ ఒక్కరు. 25 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో కట్టిపడేస్తున్న ఆయన ఇప్పటివరకు 100కు పైగా సినిమాలకు పని చేశారు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్‌ను అందించారు. క్లాస్, మాస్, లవ్, రొమాంటిక్, యాక్షన్ ఏదైనా సరే తన స్టైల్లో సౌండ్ ట్రాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అందిస్తూ దుమ్ము లేపుతాడు. కేవలం తెలుగులోనే కాదు.. ఇటు తమిళ్, హిందీ లో కూడా తన మ్యూజిక్ సత్తా చాటాడు.…
ఒకప్పుడు ఔట్ డోర్ షూటింగ్స్ అనగానే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు లేదా వైజాగ్, ఊటీ పర్యాటక ప్రాంతాల్లో వాలిపోయేది సౌత్ సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు పొలాచ్చి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చూపు ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వైపు చూస్తోంది. కోరాపూట్ జిల్లాల్లోని పలు లొకేషన్లలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి తెలుగు సినిమాలు. పుష్ప2లోని కొన్ని కీ సీన్స్ మచ్ కుండ్, లామ్తాపుట్, డుడుమాలో చిత్రీకరించాడు సుకుమార్. కోరాపూట్ జిల్లాలో…