Allu Arjun : అది గంగోత్రి సినిమా సమయం.. అందులో ఓ కుర్రాడు హీరో అని ఇండస్ట్రీలో పేరు వినిపిస్తోంది. అతన్ని చూసిన చాలా మంది ఒకటే కామెంట్.. వీడు హీరో ఏంట్రా.. ఇలా ఉన్నాడేంటి.. ఈ మాటలు ఆ కుర్రాడిని కుంగదీయలేదు. రాటు దేలేలా చేశాయి. వీడు హీరో ఏంట్రా అన్న వారే.. హీరో అంటే ఇలాగే ఉండాలి అనేలా జై కొట్టించుకున్నాడు.. అతనే ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియాను ఏలుతున్నాడు. ఆ నాటి నుంచి ఈ నాటి దాకా అల్లు అర్జున్ పై ఎప్పుడూ ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. ఆయన ఎదిగిన తీరు గురించి ఇప్పటికే వందలాది కథనాలు వచ్చాయి. కాబట్టి దాని గురించి ఇంకా చెప్పేదేం లేకపోయినా.. పుష్ప సినిమా సమయంలో జరిగిన రచ్చ గురించి మాట్లాడుకోవాలి.
Read Also : Meerut: పెళ్లయిన మూడు నెలలకే దారుణం.. అది కావాలంటూ నవ వధువును
పుష్ప సినిమా వచ్చినప్పుడు చాలా మంది బన్నీని తిట్టారు ఒక స్మగ్లర్ కథ.. దొంగతనాలు ఎలా చేయాలో చూపించే వాడు హీరోనా అంటూ విమర్శించారు. ఆ విమర్శించిన నోర్లపై బన్నీ నోరెత్తలేదు. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డుతోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అందరి నోర్లు మూయించాడు. పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని టాలీవుడ్ చరిత్రను తిరగరాశాడు. .టాలీవుడ్ లో ఏ నటుడికి సాధ్యం కాని అవార్డును దక్కించుకున్నాడు. అంతటి ఘనత సాధించినా సరే.. బన్నీ మీద మళ్లీ విమర్శలే.
ఒక దొంగ పాత్రలో నటిస్తే అంత గొప్ప అవార్డు ఇస్తారా అని విమర్శించిన వారే. స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం మంచిది కాదంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, ట్రోలింగ్స్.. అయినా సరే బన్నీ వాటిపై నోరు మెదపలేదు. ఇప్పుడు మరో అవార్డు అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మళ్లీ బన్నీనే. అప్పుడు మొదటి పార్టుకు జాతీయ ఉత్తమ నటుడిగా ఎన్నికైతే.. ఇప్పుడు రెండో పార్టుకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు దక్కించుకున్నాడు.
విమర్శలకు ఇదే ఇదే నా సమాధానం అంటూ మళ్లీ నోర్లు మూయించేశాడు. తిట్టేవారు నోటితో విమర్శలు గుప్పిస్తే.. బన్నీ మాత్రం అవార్డులతోనే సమాధానాలు ఇస్తున్నాడు. చేసిన పాత్ర ఎలాంటిదనేది అవార్డులకు కొలమానం కాదు.. అందులో ఎంత అద్భతుంగా నటించాడు.. ప్రేక్షకులను ఎంతగా ఎంటర్ టైన్ చేశాడనేదే కొలమానం. ఆ లెక్కన దేశమంతా బన్నీ మేనరిజం, డ్యాన్సులు, డైలాగులతో హోరెత్తిపోయింది కదా.. అంతకంటే ఆ అవార్డులు పొందడానికి అర్హత ఇంకేముంది అంటున్నారు బన్నీ ఫాలోవర్లు. ఇది కదా అసలైన నటుడి హుందాతనం అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Am Ratnam : ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోవడంపై దయాకర్ క్లారిటీ..