గత ఏడాది డిసెంబర్ 6న విడుదలైన పుష్ప 2: ది రూల్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, చాలా వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ముఖ్యంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనేక చర్చలు జరిగాయి. సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ (డిఎస్పి) వ్యవహరించారు. ఆయన అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట తేజ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తాడని భావించినప్పటికీ, చివరకు సామ్ సిఎస్ అనే సంగీత దర్శకుడితో పాటు తమన్‌ను కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లో భాగం చేశారు. వీరిద్దరూ కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రూపొందించారు.
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అందాల అరాచకం..
తాజాగా ఈ విషయంపై తమన్ స్పందిస్తూ, పుష్ప 2 కోసం తాను 10 రోజుల పాటు కష్టపడి మూడు వేర్వేరు వెర్షన్లలో సంగీతాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సంగీతం సినిమా బృందానికి నచ్చినప్పటికీ, ఏ కారణం వల్లో డిఎస్పి మరియు సామ్ సిఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే చిత్ర బృందం ముందుకు సాగిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ విషయంలో ఎటువంటి బాధ లేదని, అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తమన్ స్పష్టం చేశారు. .