నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. అయితే, ఆమె హిట్స్ పరంపరకు ‘సికందర్’ సినిమా బ్రేక్ వేసినప్పటికీ, ‘కుబేర’ సినిమా ఆమెకు మరో హిట్ అందించింది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALso Read: Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. ఐఎస్ఎస్‌తో ఆక్సియం-4 డాకింగ్..
అయితే, ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హను రాఘవపూడి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రవీంద్ర అనే దర్శకుడు తొలి చిత్రంగా రూపొందిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమాతో పాటు, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాకు కూడా దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నాడు. అలాగే, ‘అర్జున్ చక్రవర్తి’ అనే సినిమాకు సంభాషణలు కూడా అందించాడు. రవీంద్ర చెప్పిన కథ రష్మికాకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.