12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
Kaleshwaram Pushkaralu : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఒక చారిత్రక కార్యక్రమం జరిగింది. కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి నదీ పుష్కరాల కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాల్ పోస్టర్‌లను మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను స్పష్టం చేసింది. మే 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లను కేటాయించి, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు…
పవిత్ర గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు జరిగే గంగా పుష్కరాలు జాతరను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.
ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు…
ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రాణహిత నది పరీవాహకం వెంట పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా హాజరవుతున్నారు. గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలయ్యాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల…