Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. Read Also:Handri Neeva:…
Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే, ఉత్తరాఖండ్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం.…
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also Read: Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం..…
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన…
ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.
Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసే పనులు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ కూలీలందరినీ తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని సొరంగంలో 41 మంది చిక్కుకుపోయి 8 రోజులైంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం సొరంగం పరిశీలన అనంతరం మాట్లాడుతూ, ఈ మొత్తం ఆపరేషన్ ముగియడానికి మరో రెండు నుండి రెండున్నర రోజులు పట్టవచ్చని తెలిపారు.
దేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్)ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతుంది. సీఎం పుష్కర్ సింగ్ ధామి యూసీసీని అమలు చేయడానికి ప్రభుత్వం తరపున పూర్తి సన్నాహాలు చేశారు.
ఉత్తరాఖండ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ప్రాంతం వ్యాధికి ప్రధాన హాట్‌స్పాట్‌గా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని స్వాగతించారు. ఇది బానిస మనస్తత్వానికి తీవ్ర దెబ్బ అని అభివర్ణించారు.