Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ సమీపంలో కూలిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం మరువకముందే, ఉత్తరాఖండ్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం.
Read Also: Minister Piyush Goyal: నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..!
#UPDATE | The helicopter that went missing in Gaurikund has crashed. There were six people on board the crashed helicopter. More details awaited: Uttarakhand ADG Law and Order, Dr V Murugeshan https://t.co/vDaSNjtSva
— ANI (@ANI) June 15, 2025
సాధారణంగా కేదార్‌నాథ్ యాత్ర సమయంలో హెలికాప్టర్లు ప్రయాణికులను తరలించే ఉద్దేశ్యంతో రోజువారీగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఈరోజు ఉదయం గౌరీకుండ్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొగమంచు వల్ల హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు సమాచారం. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నా.. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
Read Also: Iran Nuclear Site: ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండెతుండి బద్దలైందా..?
जनपद रुद्रप्रयाग में हेलीकॉप्टर के दुर्घटनाग्रस्त होने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। एसडीआरएफ, स्थानीय प्रशासन एवं अन्य रेस्क्यू दल राहत एवं बचाव कार्यों में जुटे हैं।
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2025
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన “రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని రాసుకొచ్చారు. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.