Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న…
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది.
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది.
Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్‌లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్ ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Imran Khan names three suspects behind attack. Pak PM Shehbaz Sharif is one of them: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. గురువారం పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్ పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ…
మానవత్వం మంట కలిసింది.. తోటి స్నేహితురాలి పట్ల జాలి చూపాల్సిన ఓ యువతి.. రాక్షసంగా ప్రవర్తించింది. పాక్‌లో తన తండ్రిని పెళ్లి చేసుకోవాలంటూ మెడికల్ విద్యార్థినిపై ఒత్తిడి చేసింది తోటి స్నేహితురాలు. అందుకా యువతి నిరాకరించింది. తన కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ఫ్రెండ్.. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టింది. అంతేకాదు.. సారీ చెప్పాలని ఆమెతో బూట్లు, చెప్పులు నాకించారు. ఎంత…