Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడి ప్రయాణం, అతని మైండ్‌సెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వైభవ్ టీమ్ ఇండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని, ఈ వార్త విన్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని సంజీవ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. 15 ఏళ్లకే భారత జట్టులోకి ప్రవేశించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్‌ను ఇప్పుడే సచిన్ లేదా డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మహామహులు సుదీర్ఘకాలం పాటు అత్యున్నత స్థాయిలో రాణించారని, ప్రస్తుతం వైభవ్ వారి కాలి దుమ్ముతో కూడా సమానం కాదని వినమ్రంగా చెప్పారు.
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
వైభవ్ బ్యాటింగ్ శైలి గురించి చెప్తూ.. తను ఎడమచేతి వాటం బ్యాటర్ కావడంతో, తనకు ఇష్టమైన వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా బ్యాటింగ్ వీడియోలను చిన్నప్పుడు వైభవ్‌కు చూపించేవాడినని సంజీవ్ గుర్తుచేసుకున్నారు. లారాతో పాటు యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్ల వీడియోలు చూసినప్పటికీ, వైభవ్ ఆటతీరు చాలా విలక్షణమైనదని, అతను ఎవరినీ అనుకరించకుండా తనదైన సొంత శైలిలోనే ఆడతాడని స్పష్టం చేశారు.
జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల తొలి బంతికే సిక్సర్లు బాదడం వెనుక వైభవ్ సొంత వ్యూహం ఉందని తండ్రి వెల్లడించారు. చిన్నతనంలో పెద్ద అబ్బాయిలతో ఆడేటప్పుడు వారు వైభవ్‌ను పిల్లాడిగా చూసేవారని, ఆ సమయంలో ప్రత్యర్థి జట్టులోని ప్రధాన బౌలర్‌ను టార్గెట్ చేసి సిక్స్ కొడితే, మిగతా బౌలర్లు తనపై ఆధిపత్యం చలాయించలేరనే భయం వారిలో మొదలవుతుందని వైభవ్ భావించేవాడని చెప్పారు. వయసుతో కాకుండా తన ఆటతోనే గుర్తింపు తెచ్చుకోవాలనేది వైభవ్ పట్టుదల అని ఆయన పేర్కొన్నారు.
వైభవ్ కేవలం టీ20లకే పరిమితం కాకుండా టెస్టులు, వన్డేలతో సహా మూడు ఫార్మాట్లలోనూ రాణించాలని కోరుకుంటున్నాడని, గతంలో ఒక 50 ఓవర్ల మ్యాచ్‌లో 332 పరుగులు కూడా చేశాడని తెలిపారు. బీహార్‌లో తండ్రులు పిల్లలు ఎంత సాధించినా తృప్తి పడకుండా, ఇంకా ఎక్కువ సాధించాలని కోరుకుంటారని.. వైభవ్ వ్యక్తిగత పరుగుల కంటే జట్టుకు మ్యాచ్‌లు గెలిపించడమే తనకు ముఖ్యమని సంజీవ్ చెప్పారు. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా మంచి కుడిచేతి వాటం బ్యాటరేనని, ప్రస్తుతం వైభవ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అతనికి సమయం ఇవ్వలేకపోతున్నానని, త్వరలోనే అతను కూడా మంచి ప్రదర్శనతో అందరి ముందుకు వస్తాడని సంజీవ్ సూర్యవంశీ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..