ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ రోజు మధ్యాహ్నం ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే ల మధ్య జరిగిన పోరుతో ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటి విజయం కేతనం ఎగురవేసింది. అయితే రాత్రి 7.30 గంటలకు ఆర్‌సీబీ, ముంబాయి ఇండియన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టకపోవడంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆర్‌సీబీ…
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తుండగా, టైటాన్స్ కు అడ్డుకట్ట వేయాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్…
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తన స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీలను పెవిలియన్…
ఐపీఎల్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్ విధ్వంసంతో పంజాబ్ జట్టు కోలుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా లివింగ్ స్టోన్ చెలరేగాడు. అంతేకాకుండా ముఖేష్ చౌదరి వేసిన ఓవర్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే పెద్ద సిక్సర్. ముంబై ఇండియన్స్ ఆటగాడు బట్లర్ 104 మీటర్ల సిక్స్…
ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్‌లోకి అడుగుపెట్టిన ఆ టీమ్‌కు వరుస పరాజయాలు షాకిచ్చాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో జడేజా నేతృత్వంలోని జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను తుది…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో రబాడ (15) 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఆ మాత్రం…
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని…
ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 205 పరుగులు చేసింది. దీంతో ఈ స్కోరును అంతంత మాత్రంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న పంజాబ్ అందుకోలేదని అందరూ భావించారు. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అద్భుతం చేసి చూపించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అందరూ దంచికొట్టారు. దీంతో కొండంత స్కోర్ కూడా కరిగిపోయింది.…
ఐపీఎల్‌లో మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ కింగ్స్ చేధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని మోతెక్కించారు. దీంతో అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/2 స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లీ (41), దినేష్ కార్తీక్ (32), అనుజ్ రావత్ (21)…
ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను ఇటీవల జరిగిన మెగా వేలంలో వేరే జట్టు కొనుగోలు చేయడంతో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ తిరిగి దక్కించుకున్న…