కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో అయితే వెండితెరపై మాత్రమే అంటూ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వారు పునీత్. ఎంతోమందికి జీవితాన్ని జీవితాన్ని ఇచ్చిన ఆయన విద్యార్థులకు, పేద ప్రజలకు ఎంతో సహాయం చేశారు.
Read Also : కూతురు వచ్చాకే పునీత్ అంత్యక్రియలు
ప్రస్తుతం ఆయన మృతి కారణంగా కన్నడ గడ్డ శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఆయన కన్ను మూసినప్పటికీ మరో వ్యక్తికి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం పునీత్ కళ్ళు దానం చేయగా, ఆ కళ్ళను ఓ నిరుపేద వ్యక్తికి ఆపరేషన్ చేసి అమర్చారు. అతని కళ్లను మార్పిడి చేసే ముందు తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. గతంలోనే సూపర్ స్టార్, తన తండ్రి రాజ్‌కుమార్ లాగానే తాను కూడా పునీత్ తన నేత్రాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.