పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ..
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మిగిలింది ఇక విలీనమే అన్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోవడమే కాకుండా ఇప్పుడు సొంత మండలం కూడా పోయిందన్న ఆయన.. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి.. ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాడేమో...? ఆయనకు మిగిలింది అదొక్కటే అని పేర్కొన్నారు
Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికలు ముగిశాయి. క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లు కడపకు తరలించనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదన నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చారు.
Former minister Ambati Rambabu alleges: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడూ జరగనంత ఘోరంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2017లో నంద్యాల కంటే దారుణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారని.. దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా మా నేతలు వివరాలు తెలిపారన్నారు.. పోలీస్ యంత్రాంగం వైసీపీ నేతలను…