Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం…