రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ‘పంతం’ సినిమా డైరెక్టర్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘పులి-మేక’…