ఇష్టం వచ్చినట్టుగా రణగొణ ధ్వనులతో పబ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నీ పబ్ లకు సౌండ్ పై ఆదేశాలు జారీ చేసింది ఎక్సయిజ్ శాఖ. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై ఆంక్షలు విధించింది ఎక్సైజ శాఖ. పబ్ లో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించింది. నగరంలోని ఆయా పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించే దిశగా జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ,పోలీసులు సూచనలు చేసింది. పబ్ లలో…
తాగి వాహనం నడిపితే పబ్‌లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్‌లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్‌ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని…
తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక కేసులు విచారణకు రానున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారించనుంది. చెన్నమనేని తరపున నేడు మరోసారి వాదనలు వినిపించనున్నారు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ. సిటిజన్ షిప్ యాక్ట్ నిబంధనలు, వాటి ఉల్లంఘన పై oci కార్డ్ అనుమతులపై నేడు వివరణ ఇవ్వనున్నారు చెన్నమనేని తరపు న్యాయవాది. నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇటు ఇళ్ళ మధ్య ఉన్న పబ్ ల…
ఈమధ్యకాలంలో పబ్బులు చట్టవ్యతిరేక చర్యలకు, గబ్బు పనులకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వార్నింగ్ ఇచ్చారు. పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కొన్ని పబ్ ల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. పబ్ ల మీద ఫిర్యాదులు వస్తే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీపీ. పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పబ్ లు సకాలంలో మూసి వేస్తున్నారా…
ఇళ్ళ మధ్యలో పబ్ లు, బార్‌లు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటీషన్ హైకోర్టు విచారించింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్‌లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు. తదుపరి విచారణ ఈనెల 22కు హైకోర్టు వాయిదా వేసింది. Read Also: ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్…
ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.…