Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన ఘటన చోటు చేసుకుంది. గతకొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లేక వాహనదారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితికి చేరుకుంది. ప్రస్తుతం బ్రిడ్జిపై బట్టలు ఆరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు అరేసుకోడానికా అంటూ నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కాంతి ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక యువకుడు ఏడేళ్ల మహిళ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. ఏడు సంవత్సరాల క్రితం కాంతి ప్రాంతంలో ఒక స్థానిక మహిళను ఖననం చేశారు.
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…