ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.
కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్ మంకీపాక్స్. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే…