అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది.
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.
Aditya L1 Solar Mission: చంద్రయాన్-3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 శాటిలైన్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం శాటిలైట్ భూమి దిగువ కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోంది. దశల వారీగా కక్ష్యను పెంచుకుంటూ గమ్యస్థానం వైపు వెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్య ఎల్ 1 తొలి…
Aditya-L1 Solar Mission: చంద్రుడిపై గట్టు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించి ఇటీవల సక్సెస్ అయింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అత్యంత కఠినమైన దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై కాలు మోపింది. ఈ ప్రయోగంతో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై…
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది.
SSLV-D1 carrying Earth Observation Satellite is No longer usable: ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ డీ1 ద్వారా రెండు శాటిలైట్లను ఈ రోజు నింగిలోకి ప్రయోగించింది. అయితే మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. అయితే టెర్మినల్ స్టేజీలో మాత్రం ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. మూడో దశ తరువాత ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్య లోకి విడిచిపెట్టింది. అయితే…