Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- పెంటగాన్‌లో హై అలర్ట్
- ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్
- అధికారులు తరలింపు.. పోలీసులు తనిఖీలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘ప్రమాదకర పదార్థాలు ఉన్నాయన్న హెచ్చరికలతో భవనంలోని పలు విభాగాలను లాక్డౌన్ చేయడంతో పాటు కొంతమంది సిబ్బందిని ఖాళీ చేయించారు. ఈ ఘటన అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అగ్నిమాపక శాఖ, పోలీసులు విస్తృత తనిఖీల తర్వాత తప్పుడు హెచ్చరిక అని తేలినట్లు సమాచారం అందించిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర భద్రతా ప్రొటోకాల్స్‌ను అమలు చేశారు.

Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అసలేం జరిగింది?
పెంటగాన్‌లోని అంతర్గత వ్యవస్థలు గాలి నాణ్యత (Air Quality)లో సమస్య ఉన్నట్లు గుర్తించాయని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసే వరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి ‘‘షెల్టర్-ఇన్-ప్లేస్’’ ఆదేశాలు జారీ చేశారు. అంటే సిబ్బంది తమ స్థానాల్లోనే ఉండాలని సూచించారు. వెంటనే స్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి.
రంగంలోకి హాజ్మ్యాట్ బృందాలు
ఈ ఘటన నేపథ్యంలో పెంటగాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి చెందిన ప్రమాదకర పదార్థాల (HazMat) విభాగం రంగంలోకి దిగింది. వారికి ఆర్లింగ్టన్ కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం అందించింది. ఆర్లింగ్టన్ ఫైర్ అండ్ ఈఎంఎస్ అధికారులు కూడా తమ హాజ్మ్యాట్ బృందాలు ఘటనాస్థలంలో పని చేశాయని ధృవీకరించారు.
గ్యాస్ మాస్కులతో కనిపించిన సిబ్బంది
భవనంలో ప్రసారం చేసిన అంతర్గత సందేశం ప్రకారం అదనపు గాలి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలకు ఒకటి నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది సిబ్బంది గ్యాస్ మాస్కులు, రసాయన రక్షణ దుస్తులు ధరించి కనిపించడం కలకలం రేపింది. అయితే ఇవన్నీ పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.
పలు అంతస్తుల్లో లాక్డౌన్
సమాచారం ప్రకారం పెంటగాన్‌లోని రెండో నుంచి ఐదో అంతస్తుల వరకు.. నాలుగు నుంచి ఏడు కారిడార్ల మధ్య ఉన్న ప్రాంతాలను తాత్కాలికంగా లాక్డౌన్ చేశారు. కొన్ని విభాగాల్లోని సిబ్బందిని బయటకు తరలించగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను అక్కడికక్కడే ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రమాదకర పదార్థాల ముప్పు లేదని, పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. అయితే గాలి నాణ్యత సమస్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?