టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. నిత్యం వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5…