H-1B visa: ట్రంప్ సర్కార్ భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. H-1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, భారతీయులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని పలు సందర్భాల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు.
H-1B visa: H-1B వీసా ఫీజును పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు(రూ. 88లక్షలు) ఫీజు విధించాడు. ముఖ్యంగా, దీని ప్రభావం భారతీయ టెక్కీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మొత్తం హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. అయితే, హెచ్1బీ వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.