కర్ణాటకలో మరోసారి పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు వినబడినట్లు వార్తలు కలకలం రేపాయి. తాజాగా బెళగావి న్యాయస్థాన ప్రాంగణంలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు సంచలనంగా మారింది.
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం చెలరేగింది. అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోపణలపై ఫోరెన్సిక్ సైన్య ల్యాబ్ విచారణకు సీఎం పిలుపునిచ్చారు.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.