New Electricity Bill: ఇన్నాళ్లు ప్రభుత్వమే మనకు విద్యుత్ అందించేది. ఇకపై వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్ కనెక్షన్లు తీసుకునే అవకాశం వస్తోంది. మన మొబైల్ నెట్వర్క్‌లాగే, మనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకరి సర్వీస్ బాగా లేకుంటే, మరో సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. ఎలాగైతే మనం ఒక నెట్వర్క్ నచ్చకుంటే, సిమ్ మార్చి వేరే నెట్వర్క్‌కు మారుతామే అచ్చం అలాగే.
Srinivas Goud : పీవీ మార్గ్ లోని నీరా కేఫ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అంతరించుకు పోతున్న కుల వృతులను కాపాడాలని నాటి ప్రభుత్వం నీరా కేఫ్ ను ప్రారంభించారని, మీ కుల వృత్తిని కాపాడమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. నీరా పాలసీ తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. ఆరోగ్య కరమైన నీరా పానీయం అందించే లక్ష్యం చేసిందన్నా శ్రీనివాస్ గౌడ్. నీరా ప్రొడక్ట్స్…
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర గనుల శాఖ మంత్రి చెబుతుండగా, ప్లాంట్ ఆస్తుల విక్రయం చాపకింద నీరులా జరుగుతోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. తాజాగా, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు, యార్డు స్థలాలు రూ.475 కోట్లకు విక్రయించేందుకు అనుమతులు కోరారు. ఈ ఆస్తుల విక్రయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని వివరాల కోసం…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఏమి వెల్లడించారో తెలుసుకోవడం కొరకు కింది వీడియో చుడండి
పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది.
సింగరేణి ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకొని గత సీఎం కాలం వెల్లదీశాడు.. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయ్యాని వాళ్ళు ఇప్పుడు ప్రతి పక్షంలో మళ్ళీ అదే వాగ్దనాలతో మీ ముందుకు వస్తున్నారు జాగ్రత్త అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Kishan Reddy: ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.