RTA Special Drive in AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఇటు, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. మరోవైపు బెంగళూరులోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దీంతో, కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.. మరోవైపు.. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు రవాణా శాఖ అధికారులు.. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాల్లో…
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
సంక్రాంతి పండగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని అన్నారు. మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.