ప్రిగోజిన్‌పై అమెరికా అధ్యక్షులు జొ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ ఇటీవల.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.