రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?.
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపించింది. సోమవారమే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఊహించినట్టే యశ్వంత్ సిన్హాకు తన మద్దతు తెలిపింది.