Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శనివారం లేఖ రాశారు. కేంద్రం సైన్యంలో ప్రవేశపెట్టిన ‘‘అగ్నిపథ్’’ పథకానికి వ్యతిరేకంగా లేఖలో పలు అంశాలను లేవనెత్తారు. మరణించిన సైనిక కుటుంబాలకు ఇచ్చే ప్రయోజనాల స్వభావం వివక్ష ఉందని లేఖలో పేర్కొన్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సమస్య జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని అన్నారు.
Read Also: Rolls Royce: రోల్స్ రాయిస్ కారును పెట్రోలింగ్ కి వాడుతున్న పోలీసులు.. ఎక్కడో తెలుసా?
భారత రాష్ట్రపతికి రాసిన తన రెండు పేజీల లేఖలో, దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాలను అర్పించిన అగ్నివీరులకు న్యాయం అందించాలని విజ్ఞప్తి చేస్తూ తాను ఈ లేఖ రాస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. సైనికులతో సమానంగా పనిచేస్తున్న అగ్నివీరులకు తక్కువ వేతనం, ప్రయోజనాల, అవకాశాలు ఇస్తున్నారని లేఖలో చెప్పారు. సాధారణ సైనికులతో పోలిస్తే అగ్నివీరుల పట్ట వివక్ష ఉందని రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని, తాము అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మాతృభూమి కోసం అత్యున్నత త్యాగం చేసే ఏ సైనికుడికైనా సమానమైన ప్రయోజనాలను అందజేయడం ద్వారా అగ్నివీరులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.