ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని 60 కుటుంబాలకు చెందిన వాల్మీకులు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి విజయావకాశాలకు వాల్మీకి ఓటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో అంబర్పేట శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు పెద్దపీట వేశారని తెలిపారు. గత ప్రభుత్వాలు ముదిరాజులను విస్మరించారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముదిరాజులను అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.