ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో అంబర్పేట శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు పెద్దపీట వేశారని తెలిపారు. గత ప్రభుత్వాలు ముదిరాజులను విస్మరించారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముదిరాజులను అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ అధినేత నుండి డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యానని కొంతమంది తనపై అపోహలు వేస్తున్నారని చెప్పారు. దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శంకర్ తెలిపారు.
Read Also: GVL Narasimha Rao: సీఎం విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు..
గత 32 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి సేవలు అందించిన తనను పట్టించుకోలేదని శంకర్ ముదిరాజ్ అన్నారు. పార్టీ వీడినందుకు బీజేపీలో కొంతమంది డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో కలిశానని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితునయ్యానన్నారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించి పార్టీ కడువా కప్పి స్వాగతించారని శంకర్ చెప్పారు.
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
తనను బీఆర్ఎస్ పార్టీలోనికి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు శంకర్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తనపై ఎలాంటి బాధ్యతలు పెట్టిన సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు, అవసరాలు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి శాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ కు మద్దతిస్తూ.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజులకు అంబర్పేట శంకర్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.