ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.