జీవితంలో ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే ‘నెవ్వర్ గివ్ అప్’ అంటారు. అపజయానికి కృంగిపోకుండా ముందుకు సాగితేనే ఏదో ఒక రోజు విజయపు వాకిలి ఎదుట నిలువ గలుగుతాం. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే! తన 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు తొలిసారి ఎంపికయ్యాడు ప్రవీణ్. ముంబైకి చెందిన ఈ క్రికెట్ జీవితం ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంది. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టమున్నా…