ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి కొత్వాలీ ప్రాంతంలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు జౌన్‌పూర్ జిల్లా మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లోహిండా నివాసి రాజ్ నారాయణ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు కేవలం సాధారణ కారు మాత్రమే కాదు. దాన్ని రాజ్ నారాయణ్ ఓ హెలికాప్టర్ రూపంగా మార్చారు. ఆ వాహనాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే.. ఈ కారును…
చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం.. చిత్తోర్‌గఢ్ నగరానికి చెందిన సత్పాల్ సింగ్ అరోరా 81 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈయన చిత్తోర్‌గఢ్ నగరంలోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన అడ్మిషన్ కోసం లా కాలేజీకి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా నేర్చుకోవాలనే తపించే ఆయనను కొనియాడారు.…