UP : కారును హెలికాప్టర్ చేసేశాడు.. పోలీసులు దాన్ని ఏం చేశారంటే..? (వీడియో)
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హెలికాప్టర్ లాంటి కారు
- దాన్ని పట్టుకున్న స్థానిక పోలీసులు
- పోలీసులు స్టేషన్‌కు తరలింపు
- ఈ మోడిఫైడ్ కారుపై రూ.25వేల చలానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి కొత్వాలీ ప్రాంతంలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు జౌన్‌పూర్ జిల్లా మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లోహిండా నివాసి రాజ్ నారాయణ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు కేవలం సాధారణ కారు మాత్రమే కాదు. దాన్ని రాజ్ నారాయణ్ ఓ హెలికాప్టర్ రూపంగా మార్చారు. ఆ వాహనాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే.. ఈ కారును పెళ్లిళ్లలో వధూవరుల ఊరేగింపు కోసం అద్దెకు ఇచ్చేవారట. విశేషం ఏంటంటే.. ఈ కారుకు పై భాగంలో రెక్కలు సైతం అమర్చారు. వెనక భాగంలో హెలికాప్టర్‌కి ఉండే ప్రత్యేక ఆకారంలో మోడిఫైడ్ చేశాడు.
READ MORE: PM Modi: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, ఉగ్రవాదులకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
పట్టి కొత్వాల్ అవన్ కుమార్ దీక్షిత్ బధ్వా బజార్‌లో గస్తీ తిరుగుతుండగా.. ఈ హెలికాప్టర్ ఆకారంలో ఉన్న కారును చూశారు. ఈ కారును రోహిడా నివాసి దినేష్ కుమార్ పటేల్ నడుపుతున్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ అవన్ కుమార్ ఈ కారును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కారు ఆపి.. దాన్ని పరిశీలించారు. ఆ విచిత్రమైన కారును చూసిన స్థానికులు దాన్ని చూడటానికి పెద్ద మొత్తంలో గుమిగూడారు. దీంతో పోలీసులు ఆ కారును స్టేషన్‌కు తరలించారు. దీంతో పాటు ఈ కారు రూపం అనధికారికంగా మార్చినందుకు రూ.25,000 చలానా జారీ చేశారు. ఇటువంటి మోడిఫైడ్ వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. గతంలో, వారు 18 నుంచి 20 కార్లు, బుల్లెట్ బైక్‌లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
प्रतापगढ़ में दौड़ती दिखी हेलीकॉप्टर जैसे अनोखी कार।*
प्रतापगढ़ पट्टी कोतवाली क्षेत्र के ढकवा बाजार में एक ऐसी कार सड़क पर दौड़ती हुई दिखी जैसे हेलीकॉप्टर आ रहा हो पुलिस ने जैसे कार को देखा तुरन्त रुकवाया और दस्तावेज चेक किया, कार की रूपरेखा हेलीकॉप्टर जैसे दिखाई दे रही थी… pic.twitter.com/wwpWHY3i2z
— News Watch India (@NewsWatch_Ind) May 1, 2025
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!