Bhadrachalam Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలలో ఏడో రోజు కావడంతో.. భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేడుక నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. అయితే అంతా బాగానే ఉన్న భద్రాచలం రామాలయం లో భక్తులకు బూజుపట్టిన లడ్డాలు ప్రత్యక్షమయ్యాయి.
Read also: Ponguleti Srinivasa Reddy: ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తా..
దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు మండిపడుతున్నారు. లడ్డూ కౌంటర్ లో ఫంగస్ వచ్చిన లడ్డాలు విక్రయయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి కి లడ్డూ భారీగా మిగిలి ఉండటంతో.. అవే లడ్డూలను వీకెండ్స్ కావడంతో కౌంటర్ లో అమ్మకానికి పెట్టారని ఆరోపిస్తున్నారు భక్తులు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని మండిపడుతున్నారు. సుమారు 50,000 లడ్డూ కి బూజి , ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూ కి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిపై ఆలయ అధికారులు సమాధానం ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోనే ప్రముఖ ఆదేవాలయంలో ఇలాంటి లడ్డూలు విక్రయించడం ఏంటిన భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని.. గతంలో కూడా ఈ ఆలయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అయినప్పటికీ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు…భక్తుల ఆరోపణలపై వివరణ కోరేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంపై గమనార్హం.
Shilpa Shetty: ‘ముద్దు’ కేసు కొట్టి వేయండి ప్లీజ్.. కోర్టు మెట్లెక్కిన శిల్ప