ఈరోజు ఉదయం ‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు. దీంతో పోలింగ్ కాసేపు ఆగిపోయింది. తరువాత అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బృందాలని పిలిపించిన ఎన్నికల అధికారి చర్చలు జరిపారు.
Read Also : మా ఎన్నికలు.. లోపల బీభత్సం.. కురుక్షేత్రం జరుగుతోంది..!
రెండు ప్యానళ్ల సభ్యులతో చర్చించిన అనంతరం ఎన్నికల అధికారి రిగ్గింగ్ జరిగినట్లు తేలితే ఫలితాలు ప్రకటించబోనని వెల్లడించారు. అవసరం అనుకుంటే మా ఎన్నికలపై కోర్టుకు కూడా వెళతామని ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నామని, రిగ్గింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిగ్గింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలింగ్ సిబ్బంది పట్టుకున్నారు. సభ్యుడు కాని వ్యక్తి లోపలికి రావడంతో నరేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతన్ని వెంబడించి పట్టుకున్న విష్ణు ప్యానల్ సభ్యులు విష్ణు వదిలేయమని చెప్పడంతో వదిలేశారు.