Minister Lokesh: ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు.
Leopard Dies: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలం కొలుకుల ఆటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందింది. కొలుకుల ఆటవీ ప్రాంతంలో కుందేళ్లను పట్టుకోవడానికి ఉచ్చులను ఏర్పాటు చేసిన వేటగాళ్ళు.. కుందేలు కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి మృతి చెందిన చిరుత పులి..
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెంలో పోలింగ్ పునః ప్రారంభమైంది. అయితే, పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదంతో తోపులాట స్టార్ట్ అయింది. దీంతో ఈవీఎం మిషన్లు కింద పడిపోయాయి. ఇక, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..
మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య ఆశయాలను కొనసాగించాలని మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. పగడాల రామయ్య 6వ వర్ధంతి రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామంలోని ఆయన నివాసంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసీపీ ఇంచార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కొనసాగుతున్న భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వీలైనంత తొందరలో విచారణ దర్యాప్తు పూర్తి చేస్తాని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జాలపై ఎస్పీ మలికా గార్గ్‌తో కలిసి చర్చించారు.
YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.. కొండేపి వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తల్లి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు సీఎం జగన్… వరికూటి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు టంగుటూరు కారుమంచి వెళ్లనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఈ పర్యటన కోసం ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 10.05 గంటలకు హెలీప్యాడ్…
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…