Prajwal Revanna: సె*క్స్ వీడియోలు షూట్ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సిట్ దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. నిన్న జర్మనీ నుంచి బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్‌ని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అత్యంత కీలమైన మొబైల్ ఫోన్ కోసం సవాలుగా మారింది. ఈ ఫోన్ ద్వారా మాజీ జేడీఎస్ నేత, ఎంపీ అయిన ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని విచారణ అధికారులు భావిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్పష్టమైన వీడియోలను రికార్డ్ చేయడానికి ప్రాథమికంగా ఫోన్ వినియోగించినట్లు తెలుస్తోంది.
దీనిపై ప్రజ్వల్ రేవణ్ణను ప్రశ్నించగా.. ఏడాది క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని తెలిపినట్లు సమాచారం. తాను ఫోన్ పోగొట్టుకున్నప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానని, తాను కేఎస్పీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోన్ కీలకంగా మారడంతో, ప్రజ్వల్ రేవణ్ణ ఫిర్యాదుపై హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌ని సిట్ సంప్రదించింది. . ఫోన్ పోగొట్టుకున్న కేసులో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్‌సీఆర్) నమోదు చేసినట్లు పోలీసులు సిట్‌కు తెలిపారు. అయితే, పోలీసులు విస్తృతంగా సోదాలు చేసినప్పటికీ, మొబైల్ ఫోన్‌ను కనుగొనలేకపోయారు.
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
Read Also: Suspect Terrorist : భారత్ హెచ్చరిక.. ఐసిస్ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసులు
సిట్ మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను పొందింది, దానిని గుర్తించేందుకు విచారణ వేగవంతం చేసింది. వీడియోలను రికార్డ్ చేయడానికి ప్రాథమికంగా ఉపయోగించిన పరికరం ధ్వంసమైందని, అధికారులు దానిని గుర్తించడంలో విఫలమైతే, ప్రజ్వల్‌పై ‘‘సాక్ష్యాలు ట్యాంపరింగ్’’ చేశాడనే అదనపు అభియోగాలు మోపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ కుటుంబానికి పట్టున్న హసన్ జిల్లాలో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినవిగా చెప్పబడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపలు కేసు పెట్టింది. ఆ తర్వాత పరిణామాల్లో ప్రజ్వల్ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని రప్పించేందుకు సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు అతని దౌత్య పాస్‌పోర్టు రద్దుకు కేంద్రం సిద్ధమవుతున్న తర్వాత ఆయన బెంగళూర్ తిరిగి వచ్చాడు.
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..