Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కొన్ని నెలల ముందే ఈ ఫోన్‌ని తాను పోగొట్టుకున్నట్లు ప్రజ్వల్ సిట్‌కి తెలిపాడు. దీనిపై హోలినరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పాడు. ఈ ఫోన్ దొరికితే, ఈ కేసు మరింత బలంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్ ఫోన్‌ను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోందని, ఇది మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను రికార్డ్ చేయడానికి ఉపయోగించిందని సిట్ భావిస్తోంది. ప్రజ్వల్ పోయిందని చెబుతున్న ఈ ఫోన్‌ని కీలక సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Pema Khandu: “సూర్యుడు ఉదయించే రాష్ట్రం”లో కమలాన్ని వికసింపచేశాడు..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
దీంతో ఈ ఫోన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు కనుగొనడానికి ఆపిల్ సర్వర్‌లను యాక్సెస్ చేయాలని సిట్ కోరింది. సాధారణంగా, Apple iCloudలో టెక్స్ట్‌లు, వాయిస్ రికార్డింగ్‌లు, ఫోటోలు మరియు వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని నిల్వ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లోని వివరాలను తెలుసుకోవాలంటే ఐక్లౌడ్‌ని నేరుగా యాక్సెస్ చేయడమే మార్గమని సిట్ భావిస్తోంది. ఆపిల్ తన సర్వర్లను సిట్‌కి యాక్సెస్ చేసే అవకాశం ఇస్తే, ఈ కేసు దర్యాప్తు మరింత వేగం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి వాంగ్మూలమే సిట్ వద్ద బలమైన సాక్ష్యం.
ఇదిలా ఉంటే సెక్స్ టేపుల వ్యవహారం బయలకు రావడంతో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ ఇటీవల తిరిగి బెంగళూర్ వచ్చారు. ఎయిర్‌పోర్టులోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కోర్టు శుక్రవారం ఇతనిని జూన్ 6 వరకు కస్టడీకి పంపింది. ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణవిగా చెప్పబడుతున్న అనేక సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!