నిర్మల్ జిల్లా రత్నా పూర్ కాండ్లి నుంచి 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రత్నపూర్ కండ్లీ, కనకపూర్, నర్సాపూర్, వడ్డేపల్లి, బోరేగావ్ మీదుగా మామడ వరకు ఈ యాత్ర కొనసాగనున్నారు. ఈరోజు మొత్తం 14.3 కిలోమీటర్ల మేర "ప్రజా సంగ్రామ యాత్ర" కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు దఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకున్న ఆయన... తాజాగా ఐదో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతోపాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.