Bandi Sanjay: కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కరీంనగర్ బీజేపీ అడ్డా అని.. బండి సంజయ్ అడ్డా అంటూ ఆయన అన్నారు. ఆత్మాభిమానం చంపుకుని పనిచేయడం కష్టమన్న సంజయ్.. ధర్మం కోసం యుద్ధం చేస్తా అంటూ తెలిపారు. తనను ఎన్నో అవమానాలకు గురిచేశారని.. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని హేళన చేశారని ఆయన తెలిపారు. అయినా కష్టపడి పనిచేసి గెలిచానన్నారు. బీజేపీ అధినాయకత్వం తనను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలే అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తానని బండిసంజయ్ పేర్కొన్నారు.
DGP Mahender Reddy Tour: తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం..
కరీంనగర్‌లో కొట్లాడినట్లే రాష్ట్రమంతటా కొట్లాడాలని మోడీ, అమిత్ షా చెప్పారన్నారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో చెప్పడం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ మోడీని దూషించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే 5 లక్షల కోట్లు అప్పు చేస్తారన్నారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు.
2001లో సింహగర్జన పేరుతో టీఆర్‌ఎస్ పెట్టిన సభకు కూడా… ఇంతమంది రాలేదని బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేశారంటూ విమర్శించారు. తెలంగాణతో బంధం తొలగించుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడని ఆరోపించారు. దందాలు, కబ్జాల పేరుతో… లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నడంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే… నిలువ నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. ఈ 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలేనని.. కేసీఆర్ ఎన్ని నోటిఫికేషన్‌లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. తాజాగా లక్షా 46 వేల ఉద్యోగాలు కేంద్ర ఉద్యోగాలను మోడీ ఇచ్చారన్నారు.