తెలంగాణ పాఠశాలల్లో ప్రహరీ కమిటీలు వేయనున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ కమిటీలు పనిచేయనున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లు నిర్మించనున్నారు.